జగన్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలో రక్తదాన శిబిరం | Sakshi
Sakshi News home page

జగన్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలో రక్తదాన శిబిరం

Published Tue, Nov 20 2018 3:08 PM

Australia Ysrcp leaders held Blood donation camp in Sydney - Sakshi

సిడ్నీ : ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువలా వస్తోందని, దీన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ సర్కారు హత్యా యత్నానికి పాల్పడటం దారుణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడికి నిరసనగా సిడ్నీ నగరంలో ఈ నెల 17,18, 19 తేదీల్లో పారా మట్‌ రెడ్‌ క్రాస్‌ సహకారంతో పెద్ద ఎత్తున రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు.  

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య జీవిస్తూ వారి కోసం అహర్నిశలు పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జగన్‌పై ఇలాంటి దాడులకు పాల్పడటం ఏమిటని సీఎం చంద్రబాబుకి హితువు పిలికారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సీఎం చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం అవుతుందన్నారు. కార్యక్రమంలో సిడ్నీ వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు గోవింద్‌ , ప్రకాష్‌ రెడ్డి , శిరీష్‌ , చందు , రామిరెడ్డి, వెంకట్, రాకేష్, రమణ, రఘు, తరుణ్, దామోదర్‌ , శ్రీనివాస్, విష్ణు, భారతి రెడ్డి, మను రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement